నిహారికకు పెళ్లి కుదిరిందా? ..గుంటూరు కుర్రాడితో నీహారిక పెళ్లి..

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ పై చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ కూడా కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

నిహారిక కొణిదెల మ్యారేజ్ టాఫిక్ మరోసారి తెరపైకి వచ్చింది .ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల తో బిజీగా ఉంటుంది .కూతురు పెళ్లి ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. నిహారిక కు త్వరలోనే పెళ్లి చేస్తామని ఆయన చెప్పారు .వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని ఆయన అన్నారు. నెక్స్ట్ సమ్మర్ లో నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పడంతో వరుడి కూడా పిక్స్ అయి ఉంటాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది .

కొణిదెల వారి ఇంట నుంచి ఆ శుభవార్త ఎప్పుడు వస్తుందో అని మెగా అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు .తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు .ఆ పోస్టు నెటిజన్లలో ఆమె పెళ్లి వార్త పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది .స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహా’ అని రాసి ఉండగా.. ఎస్ కొట్టేసి Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసి ఉంది. మళ్లీ ట్విస్ట్కూడా చేసింది .మిస్టర్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. నిహారిక దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఉా హూ.. వాట్ …? అని కామెంట్ చేసింది. ఈ పోస్ట్ ని చూసిన చిరంజీవి కూతుర్లు

సుస్మిత కొణిదెల ,శ్రీజ కూడా కామెంట్లు పెట్టారు వై అంటూ ఇద్దరూ నిహారిక ను ప్రశ్నించారు దీంతో నిహారిక పెళ్లి గురించి ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి .ఆమె పెళ్ళి సెటిల్ అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కొంత మంది నెటిజెన్స్ కూడా ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేశారు .కానీ ఇంకొంతమంది ఇదంతా కొత్త సినిమా ప్రమోషన్ కోసమే అంటూ ..ప్రమోషన్లు ఇదంతా భాగమేనని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నిహారిక పెళ్లి కి సంబంధించిన రూమర్స్ గట్టిగా వినిపిస్తున్న సమయంలోనే ఆమె ఒక స్పెషల్ ఫోటో వదిలి అందరిని నీ మరింత కన్ఫ్యూజన్ లేకుండా చేసింది .నిహారిక పోస్ట్ పై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *