ప్రభాస్ తో నటించడానికి అది కావాలని డిమాండ్ చేస్తోన్న దీపికాపదుకొనే…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే .”మహానటి” ఫిల్మ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ నెక్స్ట్ నెక్ట్స్ ఫిలిం చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ లెవల్లో ఈ సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది .ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో బాగా హైలెట్ అవుతుంది. ప్రభాస్ జోడీగా ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే నటిస్తుందనే వార్తలు ..

ఆ తర్వాత దీపిక మహానటి గురించి ప్రస్తావించడం, ఆ ప్రస్తావన లో నాగ్ అశ్విన్ కొనసాగించడంతో.. కచ్చితంగా ఈ మూవీలో దీపికా పడుకొనే హీరోయిన్ గా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. తాజాగా దీపికా పడుకొనే ఈ సినిమాలో నటించేందుకు కండిషన్ పెట్టినట్లు సమాచారం .అందుకు అంగీకరిస్తే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు .ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే ఈ చిత్రంలో నటించడానికి ఆమె రెమ్యూనరేషన్ కాకుండా హిందీ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ కూడా అడుగుతుందట. అయితే సాహో చిత్రానికి హిందీ లో భారీగా

బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూస్తే ఈ చిత్రానికి ఇంకా భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉంది .అంటే దాదాపు ఈ చిత్రానికి 50 కోట్ల వరకూ తన రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఫిల్మ్మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *