కరణ్, సల్మాన్ లపై పోలీస్ కేసు …సుశాంత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ప్రముఖులు..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

సినీ పరిశ్రమలో బందు ప్రీతికి సుశాంత్ సింగ్
జీవితం బలై పోయిందని నెటిజన్లు అంతా ఫైర్ అవుతున్నారు .అంతేకాకుండా బాలీవుడ్ బాయ్కాట్ అంటూ ట్రేడింగ్ చేస్తున్నారు .

తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ కు చెందిన 8 మంది ప్రముఖులు కారణమంటూ వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. సుశాంత్ సింగ్ సొంత రాష్ట్రం బీహార్లోని ముజాఫ్ఫర్పూర్
కోర్టులో పిటిషన్ దాఖలైంది .సుశాంత్ బాలీవుడ్ మాఫియాకు బలయ్యాడు అంటూ సుధీర్ కుమార్ మోజు అనే న్యాయవాది ఈ పిటిషన్ను దాఖలు చేశాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ ,డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, నిర్మాత ఏక్తా కపూర్, డైరెక్టర్ దినేష్ సాజిత్ నదియా వాలా ,

భూషణ్ కుమార్, ఆదిత్య చోప్రా పై క్రిమినల్ పిటిషన్ దాఖలయింది. వీరందరూ పెట్టిన హింస కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మానసిక ఆందోళనతో బలవంతంగా తన ప్రాణం తీసుకున్నాడని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు పోటీగా వస్తున్నాడనే అసూయతో వీరు అంతా సుశాంత్ సింగ్ ను వేధించారని ఆ పిటిషన్లో వివరించారు. వీరి కారణంగానే సుశాంత్ ను సినిమా లోనుంచి తప్పించారని, అతని సినిమాలు విడుదల కాకుండా ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. నిందితులపై 306 109 504 506 సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా ఈ ఫిర్యాదులో కంగనారనౌత్ ను సాక్షిగా చేర్చారు .

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతూ గత కొన్ని రోజుల నుంచి నెటిజన్లు వరుసగా ట్రీట్ లు పెడుతున్నారు, అంతేకాకుండా బాలీవుడ్ కు చెందిన కొంతమంది ప్రముఖుల పై కూడా విమర్శలు చేస్తున్నారు.
వారిని అన్ ఫాలో చేయాలంటూ బాయ్ కట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా తమ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *