M.S ధోని సినిమా హీరో ఆత్మహత్య…షాక్ లో బాలీవుడ్ ..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సంవత్సరంలో వచ్చిన కై పో చె తో మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఆ సినిమాలో తన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని; దిఅన్టోల్డ్ స్టోరీ మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
ముంబైలోని బాంద్రా లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. డిప్రెషన్తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా సుశాంత్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టు ఆయన స్నేహితులు పోలీసులకు చెప్పారు. సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏవి లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆయన మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం బాంద్రాలోని డాక్టర్ ఆర్ యెన్ కూపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్కు తరలించారు.

తాజాగా సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా సలియాన్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. జూన్ 8న ముంబైలోని మలాద్ లో 14వ ఫ్లోర్ నుండి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు దిశా. ఇప్పుడు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *