బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్ప శెట్టి తో …స్టార్ క్రికెటర్ వీడియో …

హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్యకాలంలో టిక్ టాక్ వీడియోలు తో తెగ హంగామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ అభిమానులను హుషారెత్తించే పని పెట్టుకున్నారు డేవిడ్ వార్నర్. తెలుగు సినిమా పాటల కు తెగ డాన్స్లు వేస్తూ అందరిని ఫిదా చేస్తున్నారు. తన భార్య క్యాండీ తో కలిసి టిక్ టాక్ వీడియోలు దర్శనమిస్తున్న డేవిడ్ వార్నర్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో ను షేర్ చేశారు.

భార్యతో కలిసి స్టెప్పులేసిన ఈ క్రికెటర్ ఈ సారి ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్ప శెట్టి తో డిలీట్ చేసి, ఆ వీడియోను అందరికి షేర్ చేశాడు. ఈ వీడియోలో శిల్ప శెట్టి ఓ వెస్ట్రన్ సాంగ్ పాడుతున్నట్టు కనిపిస్తుంది, పక్క ప్రేమ్ లో హ్యాపీ గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు డేవిడ్ వార్నర్.. ఈ వీడియోలో శిల్ప శెట్టి ముఖాన్ని ఓ ఎఫెక్ట్తో ఫన్నీగా చూపించటం ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోపై తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ పక్కన పెట్టేసి టిక్ టాక్ వీడియోస్ చేసుకోమంటూ డేవిడ్ వార్నర్ కి సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్ .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *