కరోనా దెబ్బకు ముంబై వదిలేసి..హైదరాబాద్ కు మకాం మార్చిన పవన్ హీరోయిన్ ..

శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురు గానే కాకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది . అమ్మడు ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలం పాటు ఆఫర్లు లేకపోవడంతో ప్రియుడితో ఎంచక్కా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసింది .

ఆ బంధానికి గుడ్ బై చెప్పేసి తిరిగి స్టార్ట్ కెమెరా అంటూ కెమెరా ముందుకు వచ్చేసింది. డేటింగ్, ప్రేమ లాంటి వివరాలను కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతం తన సినీ కెరీర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది శృతిహాసన్. తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్ కి మకాం మార్చేసిన టు సమాచారం. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబై ,చెన్నై పట్టణాల కంటే హైదరాబాద్ నగరం ఐతేనే సేఫ్ అని భావించిన శృతిహాసన్, హైదరాబాద్ కి వచ్చేసింది అని తెలుస్తోంది. కొంతకాలం ఈ అమ్మడు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఆమె తెలుగు సినిమా వ్యవహారాలు చూసుకునే తన మేనేజ్మెంట్ టీం సహాయంతో బంజారాహిల్స్ లోని ఒక ప్రాంతం లో ఇండిపెండెంట్ హౌస్ రెంట్ కి కొన్ని ఉంటుందట.

ముంబై, చెన్నై వ్యవహారాలు సినిమా షూటింగ్ అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుందట శృతి హాసన్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ హీరోగా వస్తున్న” క్రాక్ ” మూవీ .ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది .డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే .

తాజాగా పవన్ నటిస్తున్న’ పింక్’ రీమేక్ ‘వకిల్ సాబ్’ మూవీ లో కూడా శృతిహాసన్ నటిస్తోంది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇందులో ఎంత నిజమో ఎంత అబద్దమో..?

Add a Comment

Your email address will not be published. Required fields are marked *