వెబ్ సిరీస్ లో రీఎంట్రీ ఇస్తోన్న మహేష్ సతీమణి …

వెబ్ సిరీస్ లో మిస్ సూపర్ స్టార్ .మహేష్ బాబుతో పెళ్లికాకముందు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ గారు చాలా హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా మెగాస్టార్ హీరోగా వచ్చిన అంజి చిత్రంలో నటించారు. ఆ తర్వాత మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో నటించి ఆ టైమ్ లో నే వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే .

మహేష్ బాబు ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా చేయడం మానేసింది. ఆఫర్లు లేక మానేసిందా’ కావాలని సినిమాలను వదిలేసిందా? అనే విషయాన్ని పక్కన పెడితే ఆమె అభిమానులు మాత్రం ఆమె సినిమాల్లో నటించికపోవడం తో నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆమె మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ నమ్రత మాత్రం ఆసక్తి లేదని చెప్పేసింది. మూవీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ లేదన్ననమ్రత వెబ్ సిరీస్ ల పై ఆసక్తిని కనబరుస్తున్న ట్లుగా సమాచారం.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థల్లో చిన్న సినిమాలను నిర్మించేందుకు నమ్రత ప్లాన్ చేస్తోంది .
ఈ టైం లోనే వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని అనుకుంటున్నారట. ఒక రచయిత చెప్పిన వెబ్ సిరీస్ కథ నమ్రతకు బాగా నచ్చిందట .ఆమె చాలా ఇంప్రెస్ అయిందట. మిడిల్ ఏజ్ ఉమెన్స్ చేసే ఒక పోరాటం గురించి ఆ స్టొరీ ఉంటుందట. ఆ క్యారెక్టర్ నమ్రతకు చాలా ఉత్సాహ పరచిందట. తప్పకుండా ఆ క్యారెక్టర్ లో నటించాలని ఆసక్తి కనబరిచి హుందాతనంతో కూడిన పాత్రలు చేయడం వల్ల నలుగురికి మంచి చెప్పినట్లుగా ఉంటుంది. తనకున్న నటనపై అభిరుచినిప్రదర్శిస్తున్నట్లు గా ఉంటుందని నమ్రత భావిస్తోందట .సొంతం గా నిర్మించడంతో పాటు ఆ వెబ్ సిరీస్ లో నమ్రత యాక్ట్ చేయడం కన్ఫామ్ అయిందట .త్వరలోనే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *