మ్యారీడ్ లైఫ్ పై ఉపాసన కామెంట్స్ …పెళ్లి తరువాత ఇబ్బంది పడ్డా ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది..

మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారసత్వంగా వస్తున్న అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యతలు చూసుకుంటూనే.. సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ మహిళల హక్కుల పై పోరాడుతోంది ఉపాసన కొణిదెల. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచే తనకి తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చారని, అన్ని విషయాల్లో తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది ఉపాసన. అదే తనను ఇప్పుడు స్వతంత్ర మహిళగా నిలబెట్టిందని… తన తండ్రి ప్రభావం నా జీవితం పై ఎక్కువగా ఉంటుంది. ఎంత కఠిన పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం నేను నాన్న నుండి నేర్చుకున్నాను.. అందరిని ప్రేమించడం, ఇలాంటి చాలా విషయాల్లో తన తండ్రి ద్వారా నే నేర్చుకున్నానని ఉపాసన తెలిపింది.

తన పెళ్లి తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. అత్తారింటిలో అడుగుపెట్టాక జీవితంలో ఎలా సర్దుకు పోవాలో నేర్చుకున్నానని , అడ్జస్ట్ అయ్యి బతకడం ఎలాగో నేర్చుకున్నానని, కాస్త ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది ఉపాసన. తను ఇష్టపడ్డ రామ్ చరణ్ తోనే తన పెళ్లి జరగడం అదృష్టమని, సినిమాలో రామ్ చరణ్ కి, ఇంట్లో రామ్ చరణ్ కి చాలా తేడా ఉంటుంది. అయితే ఆ సీక్రెట్ మాత్రం చెప్పను అంటూ నవ్వేసింది ఉపాసన.. చరణ్ తాను భార్య భర్తల కాకుండా ఫ్రెండ్స్ఉంటాం . ఈ లాక్ డౌన్ వల్ల ఇద్దరికీ కావలసినంత టైం దొరికింది. ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నామ్ .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *