తన పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టిన సోనుసూద్ …

ఈ లాక్ డౌన్ సమయం లో కష్టాలు పడుతున్న కార్మికులను చూసి ఆయన మనసు చలించి, తనవంతుగా వారికి సహాయం చేస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సోను సూద్..

శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఉద్ధవ్ థాక్రే ను సోను సూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్ధవ్ థాక్రే సోను సూద్ ను ప్రశంసించారు. వలస కార్మికులు పడుతున్నబాధ ల పై చర్చించారు. అయితే సోనూసూద్ చేస్తున్నా ఈ సాయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శ లు చేసాడు. ఆర్థిక ప్రయోజనాల కోసం సోను సూద్ ఇదంతా చేస్తున్నాడు అంటూ ఆ పార్టీ అధికారిక పత్రిక samna వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ని కలవడం తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు సోను సూద్.

 

లాక్ డౌన్ సమయంలో ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి వారి గ్రామాలకు చేర్చేందుకు సోను సూద్ తన సొంత డబ్బులతో బస్సులు, రైలు ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇటీవల ఆయన ఓ ఓ టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా సహాయం కావాలంటే, ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందిస్తారు. సోను సూద్ చేస్తున్న చేస్తున్న సాయం పై అందరి నుండి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *