ఐఫోన్ లతో ఇంటిని నిర్మించిన సూపర్ మన్

అసలు ఐఫోన్ అంటే ఇందియాట్ లో వాళ్లు చాలా రీచ్ అంటారు అలాంటిది ఐఫోన్ ల్ను గోడలకు అంట్టిస్తే వామ్మో.. వందలాది ఐఫోన్లను ఇంటికి టైల్స్‌లా వాడేశాడు, మీరంటే ఉన్నోళ్లు బ్రో!

ఈ వీడియో చూస్తే.. ‘‘మీరంటే ఉన్నోళ్లు బ్రో’’ అనకుండా ఉండలేరు. ఎందుకంటే.. అవి టైల్స్ కాదు. అవన్నీ ఒరిజనల్ ఐఫోన్లు.
గోడలకు ఐఫోన్-6 ఫోన్లు
గోడలకు ఐఫోన్-6 ఫోన్లు

ఒక్క iPhone విలువ ఎంత ఉంటుందో తెలిసిందే.మన అందరికీ తెలుసు. మరి అలాంటి ఐఫోన్లను ఇంటికి టైల్స్‌లా వాడేశాడంటే తప్పకుండా వాళ్లు గొప్పింటివాళ్లే అయ్యుంటారు. అబ్బే.. అవి ఐఫోన్లు అయ్యుండవు. దాని డొక్కులను అలా వాడేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. వాటిని పరిశీలనగా చూస్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అవి నిజమైన ఐఫోన్లే. టైల్స్‌లా కనిపిస్తున్న ఆ ఫోన్లన్నీ iPhone-6 మోడల్‌కు చెందినవి. ఐఫోన్-6 మోడళ్లను ఆపిల్ సంస్థ ఎప్పుడో నిలిపేసింది. వాటి అప్‌డేట్స్ కూడా రావడం లేదు. ప్రస్తుతం ఆ మోడళ్లు వాడుతున్నవారు.. అప్పటి ఫీచర్స్‌తోనే ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

ఇక ఈ ఐఫోన్ టైల్స్ విషయానికి వస్తే.. వియాత్నాంకు చెందిన ఓ టిక్‌టాక్ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 1.7 మిలియన్ మందికి పైగా వీక్షించారు. ఓ ఇంటి ప్రహారీకి నిర్మాణంలో టైల్స్‌కు బదులుగా ఐఫోన్-6లను వాడటమే ఇందుకు కారణం. ఒకటి కాదు పదులు కాదు.. కొన్ని వందల ఫోన్లను అతడు ఇంటి ప్రహారికి టైల్స్‌లా వాడేశాడు. అంటే, ఐఫోన్-6 వినియోగదారులు.. ఆ ఫోన్‌ను అప్‌డేట్ చేయలేక అమ్మేశారో.. లేదో పనిచేయని ఐఫోన్లను కొనుగోలు చేసి ఆ వ్యక్తి ఇంటికి వాడాడో తెలీదుగానీ.. లుక్ మాత్రం భలే ఉంది. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *