ఆమె పెళ్లయినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ బన్నీ’ పుష్ప ‘గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు.. ‘రుద్రమదేవి’మూవీ లో” గమ్మునుండవోయ్” అంటూ బన్నీ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అందరినీ మెప్పించింది. తాజాగా బన్నీ పుష్ప చిత్రంలో చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ ఉంటుందని సమాచారం. గుబురు గడ్డంతో ఆ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు బన్నీ

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా పంచుకున్నాడు… సినిమాల్లోకి రాకముందు తను యానిమేషన్ మీద ఉన్న ఇష్టంతో ఆ కోర్సు నేర్చుకుని, ఓ కంపెనీలో కొద్ది రోజులు అప్రెంటిస్ గా పని చేశాడట. అక్కడ బన్నీకి ఇచ్చిన జీతం 3500 రూపాయలు, అదే నా తొలి సంపాదన అని చెప్పుకొచ్చాడు బన్నీ… బాలీవుడ్ యాక్టర్ గోవింద డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన స్టెప్పులు వేస్తుంటే నా చూపు తిప్పుకోలేను. నాకు స్ఫూర్తి నిచ్చే వాళ్లలో.. 80కి దగ్గరవుతున్న కుర్రాడిలా దూసుకుపోతున్నారు అమితాబచ్చన్. నేను కూడా ఆయనలా ఆ వయసు లోను నటించాలని నా కోరిక అంటున్నాడు బన్నీ..

 

 

 

తనపై మైకిల్ జాక్సన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట..నా డ్రెస్సింగ్ స్టైల్ లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకేనేమో ఇంట్లో ఉన్న కూడా స్టైల్ గా నేను తయారవుతుంటాను . అలాగే తనకు” టైటానిక్ ”సినిమా అంటే చాలా ఇష్టమని, చిరంజీవి నటించిన ”ఇంద్ర” సినిమా,, గతేడాది వచ్చిన ”గల్లీ బాయ్” కూడా చాలా ఇష్టమని చెప్పాడు బన్నీ.. ప్రస్తుతం బన్నీ వాడుతున్నా ఎస్ యు వి రోగ్ కార్ అంటే తనకు ఇష్టమని, రెండున్నర కోట్లు పెట్టి కొన్నాడట.. రుద్రమదేవి సినిమా కి గాను తాను రెమ్యునేషన్ తీసుకోకుండా నటించడం బన్నీకి సంతృప్తినిచ్చిందట , ఫేస్ బుక్ లో కోటి మంది అభిమానుల్ని సంపాదించుకున్న తొలి సౌత్ హీరో బన్నీ..

నా పెళ్లి అయినప్పుడు అమ్మాయిలు ఎంత బాధ పడ్డారో, ఐశ్వరరాయ్ పెళ్లయినప్పుడు నేను అంతే బాధపడ్డాను.. సోనం కపూర్ స్టైల్ నాకు ఇష్టం.. మన తెలుగులో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది..సంవత్సరానికి ఒక్కసారైనా ప్యారిస్ వెళుతుంటాం.. మా అబ్బాయి అయాన్ కి ప్యారీస్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *