హనీమూన్ కు నో చెప్పిన ..యంగ్ హీరో ..మరి కారణo ఏంటో ..?

హ్యాపీ డేస్ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ ,ఈ లాక్ డౌన్ టైం లోనే తను ప్రేమించిన, డాక్టర్ పల్లవి వర్మను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా మొదట వీరి పెళ్లి వాయిదా పడింది. గా లాక్ డౌన్ ముగిశాక వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు హనీమూన్ ప్లాన్ చేశారట నిఖిల్ దంపతులు. ఇలాంటి లాక్ డౌన్ కారణంగా వీరి హనీమూన్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

 

 

 

విదేశాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులు లేకపోవడం వలన, దానితోపాటు అన్ని దేశాలలోనూ ఈ మహమ్మారి ఇ విజృంభిస్తున్న కారణంగా ప్రస్తుతానికి హనీమూన్ ప్లాన్ పక్కన పెట్టేశారట .నిఖిల్ కూడా అప్పుడే సినిమాలతో బిజీ అయ్యారట.

కార్తికేయ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అతి త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు ఈ యంగ్ హీరో నిఖిల్. పెళ్లి తర్వాత అసలు గ్యాప్ తీసుకోకుండా మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు nikhil..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *