మహేష్ బాబు కొత్త మూవీ హీరోయిన్ గా … బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూతురు ..

మహేష్ బాబు కొత్త మూవీ ‘సర్కారు వారి పాట ‘ లో హీరోయిన్ ని కన్ఫామ్ చేశారని సమాచారం.బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె అయిన సాయి మంజ్రేకర్ ను కన్ఫామ్ చేశారని సమాచారం.

‘ సరిలేరు నీకెవ్వరు’ సినిమా సక్సెస్ తర్వాత ‘సర్కారు వారి పాట ‘మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ చిత్రానికి గీత గోవిందం డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మహేష్ లుక్ ను విడుదల చేసింది . ప్రస్తుతం మిగతా నటీనటుల , హీరోయిన్ ఎంపిక విషయంలో దర్శక నిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. మహేష్ సరసన స్టార్ డైరెక్టర్ కూతుర్ని హీరోయిన్ గా కన్ఫామ్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాలో మొదటగా కియారా అద్వానీ మహేష్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి. తర్వాత రష్మిక మoదన్న పేరు కూడా వినిపించింది. కానీ తాజాగా మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ కూతురు అయిన సాయి మంజ్రేకర్ ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమెతో సంప్రదించిన చిత్ర యూనిట్ సభ్యులు ఆమె ఒప్పుకుందని .. చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *