ఫోర్స్బ్ ”వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ ” ..ఇండియా నుంచి కేవలం ఒక్క హీరో.!

ఫోర్స్బ్ వరల్డ్ హైయెస్ట్ పైడ్ సెలబ్రిటీస్ లిస్ట్ విడుదలైంది.. ఈ లిస్టులో భారత్ నుండి కేవలం ఒక హీరోకి మాత్రమే స్థానం లభించింది.

 

 

 

ఫోర్స్బ్2020 సంవత్సరానికి గాను అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది సెలబ్రిటీస్లో భారత్ నుంచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు మాత్రమే చోటు దక్కింది. ప్రముఖ గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్స్బ్2020 వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ లిస్ట్ను తాజాగా ప్రకటించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే భారత్ నుంచి స్థానం దక్కించుకున్నాడు.రూ 366 కోట్ల వార్షిక ఆదాయం తో అక్షయ్ కుమార్ కు 52 వ స్థానం లభించింది.

జూన్ 2019 నుండి మే 2020 వరకు అక్షయ్ కుమార్ ఆదాయం లెక్కించగా..రూ 366 కోట్లతో అత్యంత రాబడి కలిగిన 100 సెలబ్రిటీల సరసన నిలిచాడు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అక్షయ్ కుమార్ ఆదాయం తగ్గిందని చెప్పవచ్చు.. గతేడాది 490 కోట్లు ఉండగా.. ఈ సంవత్సరం 366 కోట్లు మాత్రమే.. ఈ లెక్కన గత ఏడాదితో పోలిస్తే రూ 124 కోట్లు తక్కువనే చెప్పవచ్చు. ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో నాలుగో స్థానంలో లో ఉన్నాడు అక్షయ్.. తాజాగా ప్రధానమంత్రి కేర్ ఫండ్ కు రూ 25 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *