విజయ్ నటించిన ”మాస్టర్” ను విడుదల కానీయకండి.. సీఎం కి లేఖ..?

విజయ్ నటించిన ‘ మాస్టర్ ‘ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేయొద్దని సీఎం కి లేఖ..

లాక్ డౌన్ వలన దాదాపు రెండు నెలలుగా స్తంభించిన సినిమా పనులన్నీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటునాయి . ప్రస్తుతం కొన్ని చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతుండగా, మరికొద్ది రోజుల్లో షూటింగ్తో పాటు, సినిమా థియేటర్స్ ఓపెనింగ్ పై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయూర్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి లేఖ రాశాడు..

 

 

ఆ లేఖలో ఈ విధంగా పేర్కొంటూ .. విజయ్ నటించిన మాస్టర్ చిత్రాన్ని ముందుగా విడుదల చేయొద్దు అంటూ.. మాస్టర్ చిత్రం ముందుగా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా వస్తారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనివలన హీరో విజయ్ కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉందని కేయూర్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

సినీ నిర్మాతలకు విధించే 26 శాతం పన్నుని రామన్న మూడు నెలల్లో మాఫీ చేయాలని కేయార్ అన్నారు. మాస్టర్ చిత్రం విజయ్ హీరోగా గా లోకేష్ kanakaraj దర్శకత్వంలో తెరకెక్కగా , విజయ్ సేతుపతి ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు . అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి ‘ వాతి కమింగ్’ అనే పాట ఇటీవలే విడుదల చేయగా, ప్రేక్షకులనుండి ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *