కూతుర్ని హీరోయిన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అత్త..?

1985లో తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది నదియా. కొద్ది కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించింది. అతి తక్కువ టైమ్ లోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. అమెరికన్ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయిపోయింది.

” మిర్చి” సినిమాలో ప్రభాస్ కు తల్లిగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందే కోలీవుడ్ లో వచ్చిన ” అమ్మ నాన్న.. ఓ తమిళమ్మాయి”రీమేక్లో జయం రవి కి తల్లి క్యారెక్టర్ చేసింది. ”మిర్చి” తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ”అత్తారింటికి దారేది..” మూవీలో పవన్ కి అత్తగా యాక్ట్ చేసి, మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకున్నా ,తమిళంలో మాత్రం చాలా బిజీగా ఉంటుంది నదియా

 

 

 

ఈమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన కూతుళ్ళను అందరికీ పరిచయం చేసింది నదియా. సనం , జా నాలతో కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ అయింది . పెద్ద కూతురు అచ్చం నదియా లాగే ఉంటుంది. తనని హీరోయిన్గా పరిచయం చేయాలని అనుకుంటుందట నదియా. తమిళంలో ఆ అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడానికి దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు దర్శకులు ఆమె దగ్గర తమ నిర్ణయాన్ని వ్యక్తపరచినట్టు సమాచారం. నదియా కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *