యాంకర్ ప్రదీప్ సరికొత్త రికార్డ్ ..

టాలీవుడ్ బుల్లితెర సూపర్ స్టార్ ప్రదీప్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల సంఖ్య కూడా మామూలుగా ఉండదు.

 

 

లేడీస్ లో ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది ప్రదీప్ కు . హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు గతంలో కొన్ని సినిమాల్లో నటించిన, తొలిసారి సోలో హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది

4 నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలోని ‘’నీలి నీలి ఆకాశం’’ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అతికొద్ది సమయంలోనే 100 మిలియన్ వ్యుస్ దక్కించుకున్న ఈ పాట అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది. 150 మిలియన్ వ్యుస్ అతి చేరువలో ఉంది ఈ పాట .ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు 200 మిలియన్ వ్యుస్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా విడుదల కాకుండానే ఈ పాటకు ఇన్ని వ్యూస్ రావడం అనేది చాలా పెద్ద రికార్డు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించాడు.

అల వైకుంఠపురం సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత ప్రదీప్ మాచిరాజు యూట్యూబ్ లో తన పాట ద్వారా తన రేంజ్ చూపిస్తున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *