”నన్ను ముట్టుకుంటే బ్లాస్ట్’’ అయిపోతారు ..అంట్టున్న అందాల రాక్షసి

‘’తనని ముట్టుకుంటే బ్లాస్ట్’’ అయిపోతారని అంటుంది అందాల రాక్షసి లావణ్య త్రిపాటి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ను చాలా మిస్ అవుతున్న ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తరచు అందుబాటులో ఉంటుంది.

 

 

 

లావణ్య తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా.. క్విజ్ మీ ..లో భాగంగా చాలా ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు లావణ్య త్రిపాటి. ఎలాంటి విషయాల్లో ఎదుటి వారిపై చిరాకు, కోపం వస్తుంది..? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా లేటుగా వస్తే నాకు నచ్చదు, ఎందుకంటే నాకు సహనం చాలా తక్కువ.. అని అన్నారు ఆమె. ఒకవేళ మీకు మీరే ఒక వార్నింగ్ ఇచ్చుకోవాల్సి వస్తే,, ఏమని ఇస్తారు.? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తూ ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు.. అనే లేబుల్ ఇస్తాను.. అని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు. అనంతరం మరో ప్రశ్నకు కు సమాధానం చెబుతూ.. ప్రతిరోజు వర్కవుట్లు చేయకపోతే నా మనసుకు నచ్చదు అని పేర్కొన్నారు లావణ్య.

గతేడాది విడుదలైన’’ అర్జున్ సురవరం’’ చిత్రంలో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాటి నటించారు. ఈ సినిమా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె’’ ఏ 1 ఇ ఎక్స్ప్రెస్’’ చిత్రంలో నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తో పాటు కార్తికేయ కు జోడీగా’’చావు కబురు చల్లగా’’ చిత్రంలోనూ నటిస్తున్నారు లావణ్య త్రిపాటి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *