అమ్మోరు గెటప్ లో అదరగొడుతున్న ..సౌత్ ఇండియా టాప్ హీరోయిన్..?

నయనతార.. సౌత్ ఇండియా లోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు . తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుండి అభిమానులను సంపాదించుకుంది ఈ అందాల తార.

 

 

ప్రస్తుతం నయనతార ఎం జె శరవన్ మరియు ఆర్ జె బాలాజీ కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న, ‘’ మూకుతి అమ్మాన్ ‘’అనే తమిళ చిత్రంలో నటిస్తోంది నయనతార. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో కిరీటం, త్రిశూలంతో .. అమ్మోరు అవతారంలో దర్శనమిచ్చింది నయనతార.చాలా పవర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తన సెకండ్ ఇన్నింగ్స్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతున్న నేపథ్యంలో, ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని వెల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఇషారి కే గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది

Add a Comment

Your email address will not be published. Required fields are marked *