24 ఏళ్ళ క్రితం … ఇండియన్ సినిమా హీరో సునీల్ శెట్టి ..రియల్ హీరో అయిన ఇన్సిడెంట్..!

ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.. మనమందరం తెలుసుకోవలసిన నిజం.. మన ఇండియన్ సినిమా హీరో బయట రియల్ హీరో అయిన ఇన్సిడెంట్..

24 ఏళ్ల తర్వాత బయట పడిన నిజం. అది 1996 ఫిబ్రవరి 5 ముంబై పోలీస్.. ముంబై రెడ్ లైట్ ఏరియా పై రైడ్ చేసి 456 మంది సర్వెవర్స్ ని సెక్స్ ట్రాపింగ్ నుండి కాపాడాడు.ఈ 456 అందులో 128 మంది నేపాల్ నుంచి.. వాళ్లని వాళ్ల స్థలం పంపించాలంటే , వాళ్ల దగ్గర చాలా మంది దగ్గర గుర్తింపు కార్డులు లేవు. దాంతో నేపాల్ గవర్నమెంట్ కూడా వీళ్ళను తీసుకెళ్లేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇండియన్ గవర్నమెంట్ నేపాల్ తో అయితే చర్చ జరుగుతుంది.. అయితే అది సోసోగానే ఉంది.

 

ఈ టైం లో మన బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి గారికి ఈ విషయం తెలిసి, ఆయన ఆ బాధ్యతను తాను తీసుకొని, ఓ ఫ్లైట్ ఏర్పాటు చేసి, వాళ్ళందరికీ టికెట్స్ కి ఆయనే పే చేసి, వాళ్ల స్వస్థల మైన కాట్మండు కు పంపించాడు. అంతేకాదు అక్కడ వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ విషయం మీడియాకు తెలియ కూడదని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే ఈ కేసులో అప్పటి మాఫియా కూడా ఇంక్లుడ్ అయ్యింది. దానివల్ల ఈ ఆడపిల్లలకు ప్రమాదమని తెలిసి ఆయన ఈ పని చేశారు.

ఈ విషయాన్ని ఆ 128 మంది లో ఒక మహిళ అయినా చినమయా తమాంగ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేకపోతే ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదేమో.. ! హాట్సాఫ్ టు సునీల్ సార్..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *