పవన్ పండ్లు పంపలేదంటున్న అలీ..మళ్ళి వారిద్దరి మద్య మనస్పర్దాలా ..?

పవన్ కళ్యాణ్..ఈ పేరు వింటే చాలు అభిమానుల కు పూనకం వచ్చెస్తుంది.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత అభిమానాన్ని దక్కించు కున్నాడో .. స్నేహితుడిగా అంతకుమించిన అభిమానాన్ని పొందాడు పవన్ కళ్యాణ్.

ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అలీ తో పవన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. కమెడియన్ ఆలీతో పవన్ కు మంచి స్నేహ బంధం ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ ఆలీ ఉండాల్సి సిందే.. అంటుంటారు పవన్ కళ్యాణ్. అయితే ఆలీ ఇటీవల కాలంలో వైయస్సార్ సిపి పార్టీ లో చేరడంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అనుకుంటున్నారు, ఇండస్ట్రీలో.

అయితే పవన్ ప్రతి సంవత్సరం తన తోటలోని మామిడి పండ్లను తన స్నేహితులందరికీ పంపించే వాడిని, ఈసారి తమ మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తనకు పవన్ మామిడి పండ్లు పంపలేదు అని చెప్పుకొచ్చారు ఆలీ. కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండటమే దీనికి కారణం అని ఆయనకు తెలిసినవారు చెప్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *