నాగబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిన టాలివుడ్ స్టార్ డైరెక్టర్ ..?

బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మాస్ డైరెక్టర్ . సినీ ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పూరి జగన్నాథ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో, అదే ఆటిట్యూడ్ తన సినిమాల్లో చూపిస్తాడు. హీరోలను ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు చెప్పించడం లో ఆయనకు ఆయనే సాటి. ఇంటర్వ్యూ లో ‘’ నాకంటే తొందరగా, పంచు డైలాగులు పూరి జగన్నాథ్ బాగా రాయగలడు’’, అంటూ చెప్పుకొచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న పూరి కి ‘’ఇస్మార్ట్ శంకర్ ‘’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

లాక్ డౌన్ కారణంగా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో తాజాగా’’’ బి ఏ లయన్’’ అంటూ ఆసక్తికరం వీడియోను పోస్ట్ చేశారు పూరి jagannath. ఈయన ట్వీట్ చేసిన ఆ వీడియోలో అతి పెద్ద జంతువు ఏది అని అడిగితే నేను ”ఏనుగు’ అని చెప్పడం విన్నాను. పొడవైన జంతువు ఏది అని అడిగితే నేను ‘జిరాఫీ’ అని చెప్పడం విన్నాను. తెలివైన జంతువు ఏది అని అడిగితే నేను ‘నక్క’అని చెప్పడం విన్నాను. వేగంగా పరిగెత్తే జంతువు ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను. ఇప్పటిదాకా చెప్పినా వండర్ఫుల్ క్వాలిటీస్ ల లో ‘ లయన్ ‘ లేదు కదా అంటే .. లేకపోతే మీ ‘సింహం ‘ అడవికి రాజు అని మీరు అంటున్నారు. ఎందుకంటే సింహం ధైర్యవంతుడు.. బోల్డ్ .. కాన్ఫిడెంట్గా నడుస్తుంది. ఎవరికీ భయపడదు. నన్ను ఎవరు ఆపలేరు అనుకుంటుంది, సింహం తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోదు.. మనం సింహం నుండి ఏం నేర్చుకోవాలి? నువ్వు వేగంగా పరిగెత్తాల్సి పరిగెత్తాలిన అవసరం లేదు.. స్మార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.. మీకు కావలసింది ధైర్యం. మీపై నీకు నమ్మకం. అది బయటకు తీసే టైం వచ్చింది. నీలో కూడా ఉన్నాడు. అంటూ వీడియో ముగిస్తుంది.

పూరి జగన్నాథ్ ఈ వీడియోను బాలయ్య ని ఉద్దేశించే ట్వీట్ చేశాడంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా బాలకృష్ణ- నాగబాబు మధ్య ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ విషయం అందరికి తెలిసిందే మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ కౌంటర్ కు కౌంటర్ గా ఇండస్ట్రీలో మీరు కింగ్ కాదు , కేవలం ఒక హీరో మాత్రమే అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్ బాలయ్యను సపోర్ట్ చేస్తూ, నాగబాబు కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేసాడు అంటూ , నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు. పూరి ఈ ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *