సినీ ఇండస్ట్రీ పెద్దలపై ‘ మరో సారి సంచలన కామెంట్స్’ చేసిన …బాలయ్య

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై నందమూరి బాలకృష్ణ చేసిన సంచలన కామెంట్స్ తో ,ఈ నాలుగైదు రోజుల్లో సోషల్ మీడియాలో ఆయన బాగా వైరల్ అయ్యారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి చర్చలు జరపడం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను వారంతా కలవడం తనకు తెలియదని బాలయ్య అన్నారు .ఆ చర్చలకు నన్ను ఎవరు పిలవలేదని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారు అని సంచలన కామెంట్ చేశారు బాలకృష్ణ .ఆ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కాస్త ఘాటుగానే స్పందించారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు .కానీ బాలకృష్ణ మాత్రం నాగబాబు వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈ విషయంలో బాలకృష్ణకు సినీ ఇండస్ట్రీ నుంచి బానే సపోర్ట్ వచ్చి .ఇక బాలకృష్ణ అభిమానులు అయితే సోషల్ మీడియా ద్వారా నాగబాబు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఈ విషయంపై బాలకృష్ణ మరోసారి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ,ఈ మధ్య సినీ ఇండ్రస్టి లో ఎందుకు ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘నేను దేనిలో inval కాను ,నిన్న మొన్న జరిగిన విషయాల్లో చాలా మంది నా పై కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఇందులో ఇన్వాల్వ్ కాడు అన్నారు .అవును నేను ఇన్వాల్వ్ కాను, అనవసర విషయాలు ఎందుకు , నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో బ్రోకర్స్, ఈ సైకో ఫాంటసీ ఎక్కువ బయట కూడా ఉంది అనుకోండి. ప్రత్యేకంగా నాకు ఉంది. మిగతా వాళ్లంతా సంగతి పక్కన పెట్టండి, నేను లెక్క చేయను, నాకున్నదంతా ఎవరికీ లేదు సైకో ఫ్యాన్సీ ,వాళ్లు నా కాళ్ళ మీద పడటం లాంటివి ఎక్కువ చేస్తుంటారు .

అయితే ఇండస్ట్రీలో తనను ఏ కార్యక్రమానికి పిలవకపోవడం గురించి ఆయన స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కడుతున్నారు దీని కోసం అమెరికా వెళ్లి వచ్చారు .నన్ను పిలవలేదు చిరంజీవిగారు అందరూ కలిసి
డల్లాస్లో ఫంక్షన్ చేశారు. 5 కోట్లు అన్నారు .వాటిలో నేను ఇన్వాల్వ్ కాను ఆర్టిస్ట్ అంటే ఒక ఫ్లవర్.. బ్యూటీ ఉండాలి. ఎందుకండి ఈ తలనొప్పులు ,కాని పనికి ఎందుకు వెళ్లి కూర్చోవడం అని బాలకృష్ణ కోపంగానే చెప్పారు .

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ పని ఇప్పటిదాకా పూర్తికాలేదు. ఇక్కడ ప్రభుత్వం మాకు సపోర్ట్ గా ఉంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ నడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా.. ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కట్ చేస్తున్నారు కదా. అవి పక్కన పెట్టి ఈ రోజు ఎందుకు సినిమా షూటింగ్లు తొందరగా మొదలు పెట్టాలి అనే ఆరాటం,

టాక్స్ ఎక్కువగా చెల్లిస్తున్న ఇండస్ట్రీ మాది. అలాంటిది ఒక్క వెధవ బిల్డింగ్ ఇప్పటివరకు కట్టలేదు.ఏం మేం డబ్బు పెట్టుకుని స్వయంగా కట్టుకునే ఆలోచనలు ఎవరికీ రావు. ఐదు కోట్లు అన్నారు , అది కాస్తా ఒకటయింది. మిగతా నాలుగు కోట్లు ఏమయ్యాయి.. ఇవన్నీ మాకు ఎందుకండి, మేము ఏమైనా లెక్కల మాస్తార్లమా .. అందుకే నేను ఏ విషయంలోనూ కలుగజేసుకొను ..అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు బాలకృష్ణ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *