బాలయ్య తన” ఈగో చూపించకుండా ఉండాల్సింది ” అంట్టున్న .. ప్రకాష్ రాజ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది.ఈ లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించిపోయాయి. సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడటంతో , సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం పలు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ ప్రబుత్వం అమలు చేస్తుండటంతో సినిమా షూటింగ్లకు అనుమతి కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మెగాస్టార్ చిరంజీవి గారి అధ్యక్షతన, పలువురు దర్శక నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు .అయితే ఈ చర్చలకు సంబంధించి

తనను ఎవరూ పిలవలేదని నందమూరి బాలకృష్ణ అనడంతో,ఇప్పుడు టాలీవుడ్ లో ఇది వివాదాస్పదంగా మారింది .బాలకృష్ణ కు కౌంటర్ గా మెగా బ్రదర్ నాగబాబు పలు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ’ సినిమా ఇండస్ట్రీకి చెందిన సమావేశాలకు తనను పిలవకపోతే ఇంత బాధ పడాల్సిన అవసరం లేదని, బాలయ్య తన ఈగో చూపించకుండా ఉండాల్సింది ‘అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడుసోషల్మీడియాలో
హాట్ టాపిక్ గా మారాయి.

చిరంజీవికి అనుకూలంగా ప్రకాష్రాజ్ మాట్లాడుతున్నాడని, బాలకృష్ణ చెప్పిన దాంట్లో తప్పేముంది అంటూ నందమూరి ఫాన్స్ ప్రకాష్రాజ్ పై మండి పడుతున్నారు.ఏదేమైనా మరోసారి ఈ వివాదం పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో ,ఈ వివాదం ఇప్పుడు ఎటువైపు తిరుగుతుందో చూడాలి మరి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *