పెళ్లి చేసుకోకుండానే తండ్రైన యువ క్రికెటర్ .. ఈ లాక్ డౌన్ మహత్యం ?

సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా టీమిండియా క్రికెటర్ ల మధ్య ప్రేమ, పెళ్లి అనే విషయాలు సర్వసాధారణమైపోయాయి .కొద్ది రోజుల క్రితం బాలీవుడ్- క్రికెట్ కపుల్స్ జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా చేరిపోయారు .

తాజాగా ఈ లాక్ డౌన్ టైం లో ఊహించని విధంగా తన భార్య.. కాబోయే భార్య అండోయ్ ..నటాషా ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.ఈమేరకు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను
తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు ఈ యువ క్రికెటర్.నేను నటాషా ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నాం .ఇప్పుడు అది మరింత బలపడుతోంది .

ఈ లోకంలోకి రాబోయే మా ప్రతిరూపాన్ని ఆహ్వానించేందుకు, మేము ఇద్దరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామంటూ రాసుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.అంతేకాకుండా తమ జీవితాలలో ఇదో కొత్త మార్పు అని, మీ అందరి ఆశీస్సులు కావాలని తన అభిమానులను హార్దిక్ పాండ్యా కోరాడు.

ఈ విషయంపై స్పందించిన భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి ఇద్దరిని అభినందించాడు. chahal కూడా వీరికి అభినందనలు తెలిపాడు .ఈ లాక్ డౌన్ టైం లో హార్దిక్ పాండ్యా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాడా? లేక పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది .హార్దిక్ ఫోటోలని లాక్ డౌన్ మీమ్స్ కోసం కూడా కొంతమంది వాడుకుంటున్నారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *