బన్ని” పుష్ప” మూవీ లో లేడీ విలన్ గా… వైసిపి ఎమ్మెల్యే

రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో సినిమా పుష్ప. ఈ సినిమా పక్క మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం

చిత్తూరు నేపథ్యంలో లో గంధపుచెక్కల స్మగ్లింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. బన్నీకి జోడిగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం చాలా రోజులుగా చాలా రకాల టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మరో పేరు రు తెరపైకి వచ్చింది. అది ఎవరో కాదండి, జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్న, ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు. మొగుడు, గోలీమార్ సినిమాలతో ఇప్పటికే రోజా గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలలో ఆమె పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి.


ప్రస్తుతం పుష్ప సినిమాలు యాంటీ షేడ్స్ ఉన్న పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ రోజా సెల్వమణి కలవడం జరిగిందని, రోజా గారు ఆ పాత్రను చేయడానికి పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తే, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తనకి వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుందేమో అని ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *