చిరoజీవి , రామ్ చరణ్ పై తేనెటీగల దాడి… చిరు చరణ్ లకు గాయాలు

చిరు రామ్ చరణ్ పై తేనెటీగల దాడి, చిరు చరణ్ లకు గాయాలు .

చిరంజీవి ,రామ్ చరణ్,ఉపాసన లపై తేనెటీగలు దాడి చేశాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు చిరంజీవి కుటుంబ సభ్యులు కొంతమంది వెళ్లారు. దోమకొండ సంస్థాన వారసుడు అయిన ఉమాపతి రావు మనవరాలు ఉపాసన అని అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడే ఉన్న చిరంజీవి కుటుంబంతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిపై కూడా అవి దాడి చేశాయి.

ఉమాపతి రావు బుధవారం తుది శ్వాస విడువగా , దోమకొండ లోని ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని అక్కడ ఉంచారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ హాజరయ్యారు.

 

 

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్ష్మి బాగ్ కు దహన సంస్కారాలకు వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్న చిరంజీవి, రామ్ చరణ్ , ఉపాసన తో పాటు , ఉమాపతి రావు కుమారుడు అనిల్ కుమార్ ,అక్కడే ఉండటంతో ,అప్రమత్తమైన సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *