విడాకులు తీసుకుంటామని చెబుతున్న … అనసూయ భరద్వాజ్ ?

తెలుగులో టాప్ యాంకర్ లిస్టులో సుమ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ..ఏ టీవీ చానల్స్ లో చూసిన ఈ అమ్మడు,అన్ని చానల్స్ ను కవర్ చేస్తూ ఉంటుంది. రకరకాల షోలు, ఈవెంటల లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటుంది.

ఈ మధ్యకాలంలో షూటింగ్ లేక పోవడంతో అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా లో తాజాగా తన అభిమానులతో ముచ్చటేస్తుంది. తాజాగా అనసూయ తన సంసార జీవితం గురించి చాలా అంశాలను అభిమానులతో పంచుకుంది. అయితే ఇందులో భాగంగా తాను తన భర్తతో తనకు పదహారేళ్ల వయసులోనే ప్రేమించానని ,రెండు మూడు సార్లు పెళ్లి చేసుకుందామని ,తన భర్తని అడగగా అతను మాత్రం పెళ్లి ఇరు కుటుంబ సభ్యుల అనుమతితోనే ,పెద్దల సమక్షంలో నే జరగాలని సర్ది చెప్పాడట. పెళ్లి జరిగిన తర్వాత తాము ఇద్దరం చాలా సంతోషం గా ఉంటున్నామని,
భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని, అంతమాత్రాన విడిపోవాలి అనుకోవడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చారు.తాము ప్రతివారం విడాకులు తీసుకుంటామని, కానీ అంతలోనే మళ్లీ కలిసి పోతామని సరదాగా మాట్లాడుకుంటాం. అని నవ్వుతూ చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్.

తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న” ఆచార్య” మూవీ లో మంచి ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తోంది అనసూయ. ఈ సినిమాయే కాకుండా” రంగమార్తాండ” అనే మర సినిమా లో దేవదాసి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో టాలీవుడ్లో దూసుకుపోతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *