నందమూరి కొణిదల మద్య గొడవ… RRR ఆగిపోతుందా ?

ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు ఉండేవి. హీరోల మధ్య గొడవలు అంటే చిరంజీవి బాలకృష్ణ అని చెప్పేవారు. అయితే అది వ్యక్తిగతంగా కాకుండా సినిమా పరంగానే ఉండేది. కొన్ని మల్టీస్టారర్ మూవీస్ వచ్చిన కూడా చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు కలిసి నటించలేదు. అగ్రకథానాయికలు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కొంతమంది నటులు కలిసి నటించారు

నందమూరి వంశం అలాగే కొణిదల వంశం ఇదివరకు ఎప్పుడూ కలిసి నటించలేదు.అయితే రాజమౌళి దీనికి చెక్ పెట్టాడనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా త్రిబుల్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ప్రస్తుతం నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సందర్భం ఉంది. బాలకృష్ణ కౌంటర్, దానికి నాగబాబు ఎన్కౌంటర్, ఓ రేంజ్ లో రచ్చ రచ్చ రేగుతున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబుపై తిట్ల దండకం అందుకున్నారు నందమూరి ఫాన్స్, అటు బాలయ్యను కూడా బాగానే ట్రోల్ చేస్తున్నారు మెగా అభిమానులు

గతంలో లేపాక్షి ఉత్సవాలు సందర్భంగా కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా నాగబాబు చిరంజీవి కి సపోర్ట్ గా మాట్లాడారు, అటు తరానికి చెందిన ఓ కమెడియన్ బాలయ్యని ఈ జనరేషన్ పరిచయం చేశాడు. ఇప్పుడు మాట ఇంకా సీరియస్ గా ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. అంటూ బాలయ్య చేసిన ఆరోపణలు, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు .రేపు ఎలాగో బాలకృష్ణకు సపోర్ట్ గా మాట్లాడాలి అంటూ, జూనియర్ ఎన్టీఆర్ పై ఒత్తిడి కూడా పెరగొచ్చు. అసలే త్రిబుల్ ఆర్ షూటింగ్ జరుగుతోంది అందులో మెగా హీరో ఫ్యామిలీ తో ఎన్టీఆర్ స్క్రీన్ స్క్రీన్ షేర్ చేసుకుంటాడు. ఎన్టీఆర్ అదే ఇక్కడ సమస్య, త్రిబుల్ ఆర్ తో మెగా అభిమానులు నందమూరి అభిమానులు కలిసిపోతారు అని రాజమౌళి భావించాడు. కొంతమేరకు అది జరిగింది కూడా, కానీ బాలయ్య స్టేట్మెంట్తో మొత్తం కలిసి మరోసారి నందమూరి మెగా ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి , ఈ ప్రెస్టీజియస్ మూవీ పై పడుతుందని రాజమౌళి టెన్షన్ పడుతున్నాడు. ఈ కరోనా ఎఫెక్ట్ తో ప్రాజెక్టు మొత్తం దెబ్బతినేలా ఉంది. భారీ వసూళ్లు, బాహుబలి కలెక్షన్లను కొట్టేయాలని అనుకున్ట్టున్నారు .

.దీనికి ఫాన్స్ వారు తోడై మరింతనష్టం కలిగిస్తోంది. గతంలో బాలయ్య సృష్టించిన వివాదాలతో
ఎన్టీఆర్ కు పెద్దగా సంబంధం ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళిద్దరికీ పడేది కాదు, కానీ హరికృష్ణ మరణాంతరం తర్వాత సంబంధాలు బాగా బలపడ్డాయి. ఎన్టీఆర్, బాలయ్య పలు సందర్భాలలో కలుసుకున్నారు .మనసు విప్పి మాట్లాడుకున్నారు, కాబట్టి బాలయ్య సృష్టించిన ఈ తాజా వివాదంపై కచ్చితంగా ఎన్టీఆర్ స్పందించాల్సిన, ఇప్పటికిప్పుడు దొరక్కపోయినా ,త్రిబుల్ ఆర్ పబ్లిసిటీ టైం లో నైనా మీడియా ఈ వ్యవహారం గురించి కచ్చితంగా అడుగుతుంది. అటు రామ్ చరణ్ కు మాత్రం ఇలాంటి పరిస్థితి అనుభవం ఉంది

తారక్ తో పోలిస్తే కాస్త అనుభవం ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చిరంజీవికి సంబంధించిన వివాదాలలో రామ్చరణ్ పేస్ చేసాడు కూడా, ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ కళ్యాణ్ పై వచ్చిన కాంట్రవర్సీ లతో పోలిస్తే తాజా వివాదం చాలా చిన్నదే ,కాబట్టి చరణ్ ఈజీగా గట్టెక్కే ఇస్తాడని అనుకోవాల్సిందే .ఈ హీరోలు ఎవరు ఈ గొడవ ని ఎలా ఫేస్ చేస్తారో ,అనే విషయాన్ని పక్కన పెడితే త్రిబుల్ ఆర్ కు ఈ సమస్య తగలకుండా ఎలా జాగ్రత్త అన్న విషయమే కీలకంగా మారనుంది.ఒకవేళ తేడా కొడితే మాత్రం సినిమా వివాదం లోనే వచ్చినట్లు లెక్క, ఎన్టీఆర్ చరణ్ ఫ్రెండ్ షిప్మీద , బాలకృష్ణ నాగబాబు వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *