సర్కారి వారి పాట చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ఈ లాక్ డౌన్ టైం ను తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ పూర్తవగానే తను నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నాడు .

గీత గోవిందం సినిమాతో మంచి ఉపుమీద ఉన్న పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాను మే 31న ప్రారంభించాలని చూస్తున్నాడు .అన్నీ అనుకున్నట్టు కుదిరితే జూన్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట. ఈ సినిమా సోషల్ మెసేజ్ కథతో పరశురాం రూపొందించినట్లు సమాచారం భారత ఆర్థిక నేరాల బ్యాక్డ్ప్ తో ఈ సినిమాను తెరక్కేక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సర్కారీ వారి పాట అనే టైటిల్ ను చిత్ర బృందం అనుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ టైటిల్ ఖాయమని చిత్ర యూనిట్ నుంచి సమాచారం. తన సినిమా ఇంకా ఓపెనింగ్ కాకముందే టైటిల్ ని రివిల్ చేయడం ఏంటని మహేష్ బాబు కోపం గా ఉన్నట్టు తెలుస్తోంది .తన పి ఆర్ టిమ్ పై మహేష్ కోపడినట్లు వినికిడి, ఇలాంటి లీకుల విషయంలో టీం అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ తన సినిమాను స్టార్ట్ చేయక ముందే టైటిల్ ఇలా బయటికి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో, అని అప్పుడే సినీ ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *