ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా ..అంటోంది ..ఆ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో రిలేషన్ షిప్ లో ఉండడం కామన్ గా వినిపిస్తున్న పాయింట్. ప్రేమలో ఉన్న .. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా ..అంటోంది ఆ నటి.

ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలామంది లవ్ మేటర్ ను బహిరంగంగానే ఒప్పేసుకుంటున్నారు . కొంతమంది మాత్రం చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన ప్రేమ గురించి చెబుతూ.. మనం ఎవరం ఊహించని జవాబు ఇచ్చింది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ బుజ్జిగాడు. ఆ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన, సెకండ్ హీరోయిన్ గా కనిపించింది సంజన. ఆ సినిమాలో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది ఈ అమ్మడు. తెలుగు సినిమా తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కన్నడ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది .

సొంత భాష కన్నడ మూవీస్ లో ఎక్కువ విజయాలు అందుకుంది. ఇటీవల సంజన పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు , పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది, అంటూ రూమర్స్ రావడంతో సంజన సీరియస్ అయింది . అది నిజం కాదు అని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సంజన ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్నట్టు ఒప్పుకుంది. అయితే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో , లేదో నాకు తెలియదు.. జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకుo టారో ఎవరికీ తెలియదు .. అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది సంజన. ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *