”క్లైమాక్స్” మూవీ టికెట్ రేట్స్ ఫిక్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..తెలిస్తే షాకే

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం క్లైమాక్స్. ఈ చిత్రంలో శృంగార తార మియా మాల్కోవా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ కోసం కుర్రకారు వెయిట్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసిన కారణంగా ,రాంగోపాల్ వర్మ ఆన్లైన్ లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. డిజిటల్ ఫార్మెట్లో rgvవరల్డ్ అనే యాప్ ను డిజైన్ చేయించుకుని, శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ‘’ క్లైమాక్స్’’ సినిమాని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ.

సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి, ఈ శృంగార చిత్రాన్ని తన పేరుతో యాప్ను డిజైన్ చేయించి అందులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పునుక్కున్నాడు. ఈ క్లైమాక్స్ సినిమాను చూడాలంటే ఒక వ్యూస్ కు 100 రూపాయలు గా ఆర్జివి ఫిక్స్ చేశాడు. ఈ సినిమా జూన్ 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఆన్లైన్లో ఈ సినిమా ప్రసారం కానున్నట్టు వర్మ చెప్పుకొచ్చాడు.

‘’ క్లైమాక్ ‘’ ట్రైలర్ను రిలీజ్ చేసిన వర్మ మంచి హైప్ సృష్టించాడు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వర్మ తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *