శ్రీరెడ్డి ని ఫాల్లో అవుతున్న మాధవి లత.. రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులు.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న న పేరు డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ది. శ్రీరెడ్డి మొదలుకొని, ప్రతి ఒక్కరిపై కామెంట్ చేస్తూ,సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు.

చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన నోటికి ఎంత వస్తే అంత తిట్టి పోస్తూ చిరంజీవి మొదలుకొని, శ్రీరెడ్డి వరకు కు అందరిని బండ బూతులతో తిడుతున్నాడు. ఆయన మాటలతో సినీ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. శ్రీ రెడ్డి, రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులు పంపించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా అదే రూట్ లో యాక్టర్ మాధవి లత, రాకేష్ మాస్టర్ కు కు లీగల్ నోటీసులు పంపించినట్టు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర మాటలు మాట్లాడాడు అంటూ మాధవి లత తన లీగల్ నోటీసుల్లో చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్ తన పట్ల అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ, యూట్యూబ్ ఛానల్స్ లో తన పరువు తీస్తున్నాడు అంటూ, లీగల్ నోటీసులకు వారం లోపే సమాధానం ఇవ్వాలని , ఇవ్వకపోతే చర్యలు తప్పవంటూ మాధవి లత హెచ్చరించింది .

అసలు రాకేష్ మాస్టర్ ఎవరు తనకు తెలియదంటూ, నాపై ఎందుకు అతను అలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతని వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి అంటూ చెప్పుకొచ్చింది మాధవి లత.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *