‘తాత నీవు నాకు కావాలి’ అంటూ బాధగా ట్విట్ చేసిన ఎన్టీఆర్

మీ పాదం మోపక తెలుగు ధరిత్రి  చిన్నబోతోంది .మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత .అంటూ నందమూరి తారకరామారావు కి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బాధతో, ప్రేమతో ట్వీట్ చేశాడు .

ఎన్టీఆర్ కి జూనియర్ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ. ఆయన కుటుంబంలో ఎవరూ చేర తీయకపోయినా, తన తాత మాత్రం చేరదీసి ప్రేమ అనురాగాలు పంచాడు. ఎన్టీఆర్ కు చిన్నప్పుడు తాత పేరు పెడదామా అని హరికృష్ణ భయపడేవాడు.తాత పేరు పెడితే అందరూ ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటే, తన 11 వ ఏట సీనియర్ ఎన్టీఆర్ వద్ద కి తీసుకుని వెళితే నీ పేరేంటి అని అడగ్గానే తారక్ అని చెప్పాడు. నువ్వు నా అంశతో పుట్టిన వాడివి తారక్ ఏంటి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకో, అంటూ జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు. 11 సంవత్సరాల వరకు తన తాత ని చూడాలని ఎంతో ఆశ పడ్డాడు, పదకొండు సంవత్సరంలో తాత దగ్గరికి చేరుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి తన తాత ఎంతో ప్రేమ పెరిగింది .

ఒకరోజు సీనియర్ ఎన్టీఆర్ విగ్గు పెట్టుకుని షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాడు అంట. అయితే జూనియర్ ఎన్టీఆర్ అల్లరి సామాన్యంగా ఉండేది కాదు. ఆ విగ్గు కాస్త పీకి కింద పడేసాడు. తాత ను చూసి ఒక్క సారిగా భయభ్రాంతులు అయ్యాడు, అయితే సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరకు తీసుకుని, మన వంశంలో భయమంటే తెలియకుండా పెరగాలి. మనం తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. అంతేగాని ప్రతి విషయానికి భయపడకూడదు.మనిషిని చూసి సింహా మే భయపడుతుంది. ఎప్పుడు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యాన్ని నేర్పాడు సీనియర్ ఎన్టీఆర్ .తన చిన్నప్పటి నుంచి పదకొండు సంవత్సరాల వరకు శాలిని జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే ఒకే ఇంట్లో ఉండే వారు .అప్పుడు ఏం చేయాలో తోచక సీనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ ఒక్కోటిగా చూపించింది తల్లి.ఒక్కసారి తాత చెప్పిన డైలాగ్ నిముషం లో చెప్పేవాడు జూనియర్ ఎన్టీఆర్.

అందుకేనేమో భారీ డైలాగులు ఇప్పుడు అవలీలగా చెప్పేస్తున్నాడు. తాత నుంచి నటనా చాతుర్యం డైలాగ్ డెలివరీ, ఆయన హావభావాలు అన్ని నేర్చుకున్నాడు తనకి ప్రథమ గురువు తన తాత, సీనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అలాగే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫాన్స్ అంటే అంతే అభిమానం. అందుకే ఏ ఫంక్షన్ లో కూడా ఫ్యాన్స్ జాగ్రత్త అని చెప్పి పంపిస్తున్నాడు. అంతేగాకుండా సీనియర్ ఎన్ టి ఆర్ సినిమా అయినా బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీలో తీసినటువంటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి భరతుడి పాత్ర ఇచ్చారు. అంతేకాకుండా ఎలా చేయాలో కూడా ఆ సినిమాలో మొత్తం నేర్పించారు, మేకప్ మాన్ కూడా తానై జూనియర్ ఎన్టీఆర్ కి మేకప్ వేసారు సీనియర్ ఎన్టీఆర్. అయితే తాత మరణంతో ఎన్టీఆర్ చాలా కృంగిపోయి, తనని ఎవరు రానివ్వలేదు తాత మాత్రమే రానిచ్చేవాడు, అక్కున చేర్చుకున్నాడు .

ఇప్పుడు తాత కూడా నందమూరి వంశం లో ప్రేమగా చూసుకునే ఏకైక వ్యక్తులు ఇక ఎవరు ఉండరు అంటూ బాధపడ్డాడు. తన తాత గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ .అంత ప్రేమ అభిమానాలు జూనియర్ ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ మీద ఏర్పడ్డాయి. ఆయన 97 వ జయంతి సందర్భంగా ఈ గుండె ను మరోసారి తాగి పోతాత అంటూ ప్రేమగా ట్వీట్ చేసాడు . ఈ ట్వీట్ బట్టి చూస్తే తాత అంటే ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ మీద ఎంత ప్రేమ, అనురాగం ఉన్నాయో తెలుస్తుంది. ఎన్టీఆర్ మీద ప్రేమ అనురాగాలు ఇలాగే ఉండి ఆయన స్థాపించిన టిడిపి పగ్గాలను తొందరలోనే చేపట్టాలని మీ కోరుకుంటున్న మీ ఫ్యాన్స్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *