జబర్దస్త్ షో నుంచి ఆ యాంకర్ తప్పు కున్నట్టేనా ..! కారణం అదేనా ..?

బుల్లితెర రంగంలో ఏ షో లకు రానటువంటి క్రేజ్ జబర్దస్త్ కు వచ్చింది. ఈటీవీ లో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఎప్పుడు టాప్ రేటింగ్స్ తో ముందుకెళ్తుంది.
ప్రతి గురు శుక్రవారాలలో 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది, కామెడీ షో జబర్దస్త్. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నుంచి .చాలామంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. మంచి పేరు తెచ్చుకున్నారు . ఇక యాంకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా . రేష్మి గౌతమ్, అనసూయ తమ అందాలతో ఈ షోకు ఎక్స్ట్రా గ్లామర్ తెచ్చి పెడుతున్నారు.తాజాగా షో నుంచి ఓ వార్త హల్ చల్ చేస్తోంది , సోషల్ మీడియాలో. జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ ఈ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ అన్నీ ఆగి పోయాయి. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని షూటింగ్లకు అనుమతించింది. ఒకేసారి అన్ని షూటింగులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయ డేట్స్ విషయంలో కాస్త ఇబ్బంది కావడంతో, జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఈ క్రమంలో లో యాంకర్ మంజూష పేరు బలంగా వినిపిస్తోంది. ఈ అమ్మడు పలు షో లలో, ఈవెంట్లలో కూడా బాగా యాంకరింగ్ చేస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *