సినిమాల్లోకి సురేఖవాణి కూతురు ..ఆ వీడియోస్ అన్ని ఇందుకేనా ?

బుల్లితెర నుండి తెలుగు ఇండస్ట్రీ కీ పరిచయమైంది సురేఖా వాణి . టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి .

తాజాగా ఈమె తన కూతురు సుప్రీత ని పరిచయం చేయడానికి సోషల్ మీడియా ను తెగ ఉపయోగించుకుంటోంది. టిక్ టాక్ లో మరియు యు-ట్యుబులో తల్లీ కూతుళ్ళు కలిసి డాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు.

ఈ వీడియో ద్వారా తన కూతురు సుప్రీత టాలెంట్ ని అందరికి తెలియాలని, కూతుర్ని హీరోయిన్ గా చూడాలని సురేఖ వాణి భర్త కోరికట . టాలీవుడ్ లో నార్త్ ఇండియన్స్ అమ్మాయిలకి ఇచ్చే ప్రాధాన్యత, మన తెలుగు అమ్మాయిలకి ఉండదు. చాలామంది టాలెంటెడ్ తెలుగు హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ సినిమాలు చేయలేదు.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నీహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. జీవిత రాజశేఖర్ ల కూతుళ్ళూ హీరోయిన్స్ గా ప్రయత్నం చేస్తున్నా.. అంతంతమాత్రంగానే వారి అదృష్టం ఉంది. ఇలాంటి టైమ్ లో సురేఖ వాణి తన కూతుర్ని హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలబెట్టుకో గలుగుతుందా.చూడాలి మరి..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *