ఈ షో ల కారణంగా సుమ , ఝాన్సీ ల పై పెద్ద దెబ్బ పడినట్టేనా ..?

ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో సినిమా రంగానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి.ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే డైలీ సీరియల్స్, రియాలిటీ షోలు, గేమ్ షో ల పరిస్థితి మరీ దారుణం గా తయారయింది .

కొన్ని షోలా కొనసాగింపుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు . యాంకర్ సుమ, ఝాన్సీ యాంకరింగ్ చేస్తే షోలను నిలిపివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. బుల్లితెర రంగంలో మళ్లీ షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది .డైలీ సీరియల్స్ ,గేమ్ షో లు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు .షూటింగ్లో షెడ్యూల్స్ టైమింగ్స్ ను రెడీ చేసుకుంటున్నారు .కాగా కొన్ని గేమ్స్ షో వాళ్ళ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది .

ఇందులో ఒకటి వైఫ్ చేతిలో లైఫ్ ఈ ప్రోగ్రాం కు సుమ యాంకరింగ్ చేస్తుండగా ,మరో ప్రోగ్రాం parivar లీక్ సీజన్ టు కు ఝాన్సీ యాంకరింగ్ చేస్తోంది.ఈ షోలపై భారీగానే దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు షూట్ చేసిన
భాగాలను మాత్రమే టెలికాస్ట్ చేసిన తర్వాత, ఈ షోలను నిలిపి వెస్తారని తెలుస్తోంది.ఈ షోలలో సుమ యాంకరింగ్ చేసే వైస్ చేతిలో లైఫ్ షోలో ప్రేక్షకులు పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్కువమందిని అనుమతించకూడదని ప్రభుత్వం ఉతర్వులు జారి చేసింది .

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించకుండా అతికొద్ది మంది తోనే షూటింగ్ చేసుకోవచ్చని ఆదేశించింది .ఇక ఝాన్సీ యాంకరింగ్ చేసే parivar లీక్ సెలబ్రిటీలతో షో నిర్వహించాల్సి వస్తుంది. సెలబ్రిటీలతో నిర్వహించేటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది .బుల్లితెర రంగంలో సుమ, ఝాన్సీ ప్రోగ్రామ్స్ ఏ కాకుండా మరికొన్ని వాటిపై దెబ్బ పడేటట్టు ఉంది. ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఆధారంగా నడిచే షో లకు కష్ట కాలమనే చెప్పొచ్చు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *