సాహో డైరెక్టర్ సుజిత్ మూవీ లో.. విజయశాంతి

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది.లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు.

ఈమెకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నా, పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో సినిమాలను ఒప్పుకో లేకపోతోంది ..మహేష్ బాబు సినిమా తర్వాత ఆమె ఇంకొక సినిమా ఏది సైన్ చేయలేదు. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

అది కూడా మరెవరో కాదండి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాతో ,సుజిత్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళం చిత్రం ”లూసిఫర్” ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే ,అయితే” ఆచార్య”సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది .ఈ సినిమాలో మలయాళంలో మంజు వారియర్ చేసినా క్యారెక్టర్ కోసం విజయశాంతిని సంప్రదించినట్టు సమాచారం .

”లూసిఫర్” లో మంజు వారియర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కు విజయశాంతి అయితే సరైన న్యాయం చేస్తుందని భావించి ,ఆమెనూ సంప్రదించినట్టు తెలుస్తోంది. విజయశాంతి గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది .

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *