ఆ ఇద్దరు స్టార్ హీరో లతో … త్రివిక్రమ్ మల్టిస్టారర్ సినిమా ?

బన్నీ హీరోగా వచ్చిన అల .. వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు , డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమా గురించి ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్’’ ఆర్ ఆర్ ఆర్’’సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే, త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెడతారని అనుకున్నా, అది ఇప్పట్లో జరిగే లా లేదు . ‘’ ఆర్ ఆర్ ఆర్ ‘’షూటింగ్ లేట్ కావడంతో యంగ్ టైగర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకో సినిమా చేస్తారని, ‘’ విక్టరీ వెంకటేష్’’ తో ఓ సినిమా చేస్తానని , ఆయనతో కమిట్మెంట్ ఉందని, వచ్చిన ఈ గ్యాప్ లో ఈ సినిమా పూర్తి చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయ్ . ఆ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వెంకటేష్- నాని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. వెంకటేష్- నాని ఇద్దరి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోడైతే , ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీ హిట్ ఖాయం . ఈ ప్రాజెక్టు నిజంగా కార్య రూపం దాలుస్తుందా, లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *