సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం..

ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ , సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది.

ఆమె కొడుకు అభినయ్ వెంకటేష్ నిన్న ఉదయం గుండెపోటుతో మరణించాడు. ఊటీ లో డాక్టర్ గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్ పట్టు కు వెళ్లారు. ఆ రాత్రి తన కొడుకుతో సరదాగా గడిపిన వెంకటేష్.. ఉదయానికి విగతజీవిగా పడి ఉన్నాడని, సన్నిహితులు చెబుతున్నారు.

నిద్రలోనే హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయాడని తెలిపారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి రావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. అభినయ్ భార్య కూడా డాక్టర్ ఏ అని సన్నిహితులు చెబుతున్నారు. సావిత్రి మనవరాలి హాస్పిటల్ లోనే అభినయ్ భార్య పని చేస్తోందట. అభినయ్ వెంకటేష్ అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయని తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభినయ్ మృతితో వాణిశ్రీ గారు దిగ్భ్రాంతికి గురి అయ్యారని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమ , వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. వాణిశ్రీ కి ఒక కుమార్తె , ఒక్కగానొక్క కొడుకు ఉన్నారు.

Tags:

Add a Comment

Your email address will not be published. Required fields are marked *