చంద్రముఖి సీక్వెల్ లో ఆ క్యారెక్టర్ కోసo ఒకప్పటి స్టార్ హీరోయిన్ ..

రజనీకాంత్ హీరోగా పి.వాసు డైరెక్షన్లో తమిళంలో రూపొందించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో,ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .అందులో లక లక లక అంటూ జ్యోతిక చేసిన యాక్టింగ్ ఎప్పటికి మర్చిపోలేము.

 

 

ఈ సినిమా మాతృక మలయాళంలో మొదటగా వచ్చింది. అక్కడ చంద్రముఖి క్యారెక్టర్ లో శోభన గారు నటించారు . తరువాత ఆ సినిమా కన్నడంలో రాజ్ కుమార్, సౌందర్య గారు ప్రధాన పాత్రలు పోషిచారు. చంద్రముఖి సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చి ది ,తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .

ఈ సినిమాకి సీక్వెల్ గా విక్టరీ వెంకటేష్ తెలుగులో నాగవల్లి టైటిల్ తో పి.వాసు డైరెక్షన్లో సినిమా వచ్చింది కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.తాజాగా పి.వాసు డైరెక్షన్లోనే లారెన్స్ మెయిన్ లీడ్ రోల్ లో చంద్రముఖి 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చంద్రముఖి కి కొనసాగింపుగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో జ్యోతిక చేసిన క్యారెక్టర్లో సిమ్రాన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీ లోనే నంబర్ వన్ హీరోయిన్ గా సిమ్రాన్ పేరు తెచ్చుకుంది. చంద్రముఖి 2 తో ఈ అమ్మడు రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది .ఈ పాత్ర కోసం సిమ్రాన్ ని, పి వాసు ఎంపిక చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. జ్యోతిక స్థాయిలో సిమ్రాన్ యాక్టింగ్ ఉంటుందో లేదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *