ఈ ఎదురు దెబ్బలు ఎందుకు… కోర్టు తీర్పు పై జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కార్యాలయాలకు వై ఎస్ ఆర్ సి పి రంగులు వేయడం, విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఈ వ్యవహారంలోను , మాజీ ఇంటిలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారంలోనూ ,ఇలా అన్ని విషయాల్లోనూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నడంతో ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారాయి.

కోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కీలకమైన అంశాలపై ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పట్టే విధంగా హైకోర్టు తీర్పులు ఉన్నాయని,ఇప్పటికే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంది . అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనూ, దీని గురించి కథనాలు వస్తున్నాయి .ఈ విషయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్గా దృష్టి పెట్టినట్లు కనబడుతోంది .కోర్టు తీర్పుపై ,ఉన్నత అధికారులకు ఈ రోజు జగన్ సమీక్ష నిర్వహించబోతున్న నట్లు తెలుస్తోంది .

తాజాగా హైకోర్టు తీర్పునుతాజా పరిణామాల పై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నాడట.కలర్స్ విషయంలో హైకోర్టు తప్పుపట్టిన, ఏబీ వెంకటేశ్వరరావు, డాక్టర్ సుధాకర్ విషయాలలో వచ్చిన తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు .

డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, దీనిపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే క్యాట్ తో పాటు కేంద్రం సమర్దించిన ఏ బి వెంకటేశ్వర రావు కేసులో సస్పెన్షన్ ఎత్తివేయాలని ,తీర్పు చెప్పడం తో ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారాయి. అనేది జగన్ భావన .ప్రస్తుతం హైకోర్టు వెలువరించిన మూడు తీర్పులపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది .

దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనేది జగన్ ఆలోచన.గతంలో కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఎలా అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించారో , ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించాలని జగన్ చూస్తున్నారు .

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో, లీగల్ టీం లోనూ మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే లీగల్ టీం లోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *