షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ..కేసీఆర్ కు చిరంజీవి కృతజ్ఞతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ముఖ్య లంతా భేటీ అయ్యారు .టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు మొదలు పెట్టాలని లేకపోతే చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చిరంజీవి తో సహా చాలా మంది సినీ ప్రముఖులు కెసిఆర్ కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్లు వినిపిస్తోంది .

మెగాస్టార్ తన ట్విట్టర్ అకౌంట్ లో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు .తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరపున కృతజ్ఞతలు, ఈ రోజు వారు సినిమా

డిజిటల్, టీవీ మీడియాకు సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని వేలాది మంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగించేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అని చిరంజీవి ట్వీట్ చేశారు.

వినోద పరిశ్రమ మళ్లీ ప్రారంభించే విధి విధానాలు త్వరలో ప్రభుత్వం రూపొందించి అందరికీ మేలు కలిగేలా చూస్తా అని హామీ ఇచ్చారని చిరంజీవి గారు తెలిపారు .తెలుగు చలనచిత్ర పరిశ్రమ టీవీ పరిశ్రమ తరుపున కెసిఆర్ గారికి చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భేటీలో అవుట్డోర్, ఇండోర్ షూటింగులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ ఓ మాక్ వీడియో ని కెసిఆర్ కు చూపించారు ,చిత్ర పరిశ్రమ ప్రముఖుల షూటింగ్ జరిగే ప్రాంతాల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎలాంటి జాగ్రత్త ల తో ముందుకు వెళ్దామని వివరించినట్లు తెలుస్తోంది .జూన్ నుండి షూటింగ్లు ప్రారంభించు కోవాలని కెసిఆర్ గారు చెప్పారు. మూవీ షూటింగ్ లపై విధి విధానాలు రూపొందిం చాలని

అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ లో దశలవారీగా పునరుద్ధరిస్తామని .లాక్ డౌన్ నిబంధనలు కరోనా నివారణ మార్గదర్శకాలు పాటించాలని కెసిఆర్ సూచించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *