ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన .. పూనమ్ కౌర్

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో,తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది పూనమ్ కౌర్.ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేసింది .సినిమాలకంటే పలు వివాదాలతో బాగా ఫేమస్ అయింది .

 

 

 

 

 

 

ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాల్ని ధైర్యంగా చెబుతుంది. పూనమ్కౌర్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ సేటేర్ వేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది .ఎన్టీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది. చిన్నప్పట్నుంచి తిరస్కరణకు గురయ్యాడు అంటూ సంచలనమే రేపుతుంది

ఎదుగుతున్న వయసులో ఆ కారణంగా తన తప్పు ఏమాత్రం లేకుండా అయిన వారి ప్రేమకు దూరం అయ్యాడు. చిన్నప్పటినుంచి పెద్ద అయెంత వరకు, అతని ప్రయాణం ఎదిగిన తీరును నేను ఎంతగానో గౌరవిస్తున్నాను .స్వర్గంలో ఉన్నా అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. అంటూ బెస్ట్ విషెస్ అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేసింది .

కాగా ఈ పోస్టులో ఎక్కడ ఎవరి పేరు ప్రస్తావించకుండా ఈ ట్వీట్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనమ్ కౌర్ పరోక్షంగా చేసిందని నెటిజన్స్ భావిస్తున్నారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *