అతిలోక సుందరి శ్రీదేవి ఇంట కరోనా కలకలం..

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ఇంట కరోనా కలకలం .బోని కపూర్ కుటుంబ సభ్యులను భయాందోళనలో పడేసింది. ఇటీవల కపూర్ ఫ్యామిలీ ఇంటి పనిమనిషి ఒక వ్యక్తికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులందరినీ కరోనా పరీక్షలు చేయించిన అధికారులు నెగిటివ్ అని తేల్చారు. మరో ఇద్దరు పని వారికి మాత్రం పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది.ఎలాంటి కారణాలు లక్షణాలు లేకుండా మేమంతా బాగానే ఉన్నాము అంటూ కపూర్ ఫ్యామిలీ సన్నిహితులు అభిమానులకు తెలిపారు.

తాజాగా మేమంతా కూడా బాగానే ఉన్నామని తమకు ఎలాంటి వైరస్ సోక లేదని బోనీకపూర్ చెప్పుకొచ్చారు.కపూర్ ఫ్యామిలీ నుండి ఇలాంటి ప్రకటన రావడంతో సన్నిహితులు అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కపూర్ ఫ్యామిలీ కి రెండు రోజుల తర్వాత కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు చెప్పుకొచ్చారు .

మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువ ఉండడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనా సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చిన, ఏ ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సినీ ప్రముఖులు భయపడుతున్నారు.ప్రస్తుతానికైతే బాలీవుడ్లో వైరస్ భయం లేదు కానీ భవిష్యత్తు గురించే ఆందోళన .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *