R R R ఎఫెక్ట్ తో.. కన్ఫ్యూజన్ లో పడ్డ K G F డైరెక్టర్ ?

ఈ మహమ్మారి కరోనా కారణంగా , ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి .

దర్శకుల ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. చాలామంది నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓసినిమా ప్రభావం ఇంకో సినిమాపై ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఈ లాక్ డౌనే ఉదాహరణ.

కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎఫెక్ట్ కే జి ఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై పడింది. ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో , ఓ భారీ మూవీ ప్లాన్ చేశారు.సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా రెండు నెలల క్రితమే సిద్ధం చేసుకున్నాడట. అయితే ఈ లా క్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్. సినిమా షూటింగ్ ఆగిపోవడం, ఎన్టీఆర్ మరి కొన్నాళ్ళ వరకు వేరే సినిమా షూటింగ్స్ చేసె ఛాన్సే లేదు.
ఆ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయడం కష్టమే. ఆర్.ఆర్ ఆర్ మూవీ షూటింగ్ పూర్తయితే ఏ టెన్షన్ ఉండేది కాదు. ఈ పరిస్థితుల కారణంగా ఎలాంటి ప్లాన్ వేసిన వర్కౌట్ అయ్యేలా లేదని , ప్రశాంత్ నీల్ నిరాశ చెందినట్లు , సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *