రామ్ చరణ్ కు జోడిగా రస్మిక మందన్న ..భారిగా డిమాండ్ చేస్తోందా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా , టాలీవుడ్ హిట్ సినిమాల డైరెక్టర్ కొరటాల శివ ”ఆచార్య ” మూవీ కి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చకర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మంచి ఫామ్ లో ఉన్న రష్మిక మదన్న, రామ్ చరణ్ కు జోడిగా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రష్మిక పాత్రకు పెద్ద ఇంపార్టెంట్ లేకపోయినా, ఆమె మాత్రం తన రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తోందని, సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొదలై 45 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గారి సరసన నటించే హీరోయిన్ పేరు మాత్రం ఖరారు చేయలేదు.

రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంటుంది.. ఈ కన్నడ భామ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న, ” పుష్ప’మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే కాకుండా తమిళ చిత్రంలో కూడా నటించేందుకు అంగీకరించింది. కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *