సూర్య ఇంకోసారి ఆ డైరెక్టర్ కే చాన్స్ ఇస్తున్నాడా ..?

మన తెలుగు లో హీరోలకు ఉన్నoత , ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు తమిళ్ హీరో సూర్య. మురుగదాస్ డైరెక్షన్లో ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ’’ గజిని’’. ఈ సినిమా తమిళ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో, అదే రేంజ్ హిట్ తెలుగులో కూడా అయ్యింది.

‘’ గజినీ’’ సినిమా నుండి ఇప్పటివరకు సూర్య ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూన్నారు . సూర్య నటించిన ‘’వీడొక్కడే’’, ‘’బ్రదర్స్’’,’’ బందోబస్త్ ‘’ ఈ సినిమాలకు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల్లో బందోబస్తు మాత్రమే కాస్త నిరాశ పరచిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి కె.వి ఆనంద్ డైరెక్షన్ లో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో ‘’ ఆకాశం నీ హద్దురా ‘’ సినిమా లో నటిస్తున్నాడు. సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది . ఈ సినిమా పూర్తవగానే సింగం డైరెక్టర్ హరి తో యాక్షన్ మూవీ , తర్వాత శివ డైరెక్షన్లో కూడా ఓ సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీస్ పూర్తి అయిపోయిన తర్వాత నే డైరెక్ట్ కె.వి.ఆనంద్ తో సినిమా ఛాన్స్ అని అనుకుంటున్నారు . ఈ చిత్రం.గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags:

Add a Comment

Your email address will not be published. Required fields are marked *