15 వేల రూపాయల కోసం ఆ నటి ఏం చేసిందో.. ?

ఈ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ కారణం సినిమాలు , టివి షూటింగ్స్ అన్నీ ఆగి పోయాయి. దీంతో కొత్త కంటెంట్ లేకపోవడంతో టీవీ ల లో అప్పటి రామాయణం, మహాభారతo లాంటి సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తున్నారు . ఈ లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు ఎప్పుడూ లేని విధంగా ఇంటి వద్ద ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో. బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌస్ లో, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి కొత్త పాటల పై ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు .

ఈ లాక్ డౌన్ కారణంగా పెద్ద నటీనటులకు ఎలాంటి ఇబందులు లేకున్నా , చిన్న చిన్న పాత్రలు చేసుకునే యాక్టర్స్ తో పాటు టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసే వాళ్ళ కు మాత్రం , చేతిలో డబ్బులు లేక చాలా ఇబంది పడుతున్నారు .

తాజాగా ఓ టివి నటి సోనాల్ వెంగర్లేకర్ తన మేకప్ మ్యాన్ దగ్గర 15 వేల రూపాయలు ,అప్పుగా తీసుకుందట .ఆమెకు ఇవాల్సిన మనీ ఇప్పట్లో ఇవ్వలేను అని నిర్మాత చెప్పడం తో ,తన దగ్గర పని చేసే మేకప్ మ్యాన్ తో రూ .15 వేలు తీసుకున్నట్టు , తన ట్వి టర్ లో పోస్ట్ చేసింది .. ఈ లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్,లేక చేతిలో డబ్బులు ,లేకపోవటం తో చాలా ఇబంది పడుతున్నట్లు ఆమె తెలిపారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *