చిరంజీవి కోసం బీభత్సమైన కథ రెడీ చేస్తున్న యంగ్ డైరెక్టర్ ..?

అసిస్టెంట్ డైరెక్టర్ గా , స్క్రిప్ట్ రైటర్ గా , కొన్ని చిత్రాలకు పనిచేసిన , బాబి ప్రస్తుతం ఉన్న తెలుగు డైరెక్టర్స్ లో ప్రతిభ గల యువ దర్శకుడు. రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

పవర్ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఈ యంగ్ డైరెక్టర్ని వరించింది. పవన్ తో రూపొందించిన, ‘’సర్దార్ గబ్బర్ సింగ్’’ సినిమా ఫ్లాప్ అయినా బాబీ కి మాత్రం డైరెక్టర్ గా ప్లస్ అయ్యింది . ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ నిర్మించిన’’ జై లవకుశ ‘’చిత్రం తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో చూపించి అలరించాడు. విక్టరీ వెంకటేష్- నాగచైతన్యతో మల్టీస్టారర్ సినిమా చేశాడు. అయితే తాజాగా బాబి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కన్ఫామ్ చేశారు.. డైరెక్టర్ బాబి చెప్పిన కథ నచ్చిందని ఆయన పేర్కొన్నారు..

కెరీర్లో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం బాబి కి దక్కింది. అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లక్ ఉన్నంత మాత్రాన సరిపోదు ,టాలెంట్ కూడా ఉండాలి .అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ బాబి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *